- Advertisement -
- – కాపులకనపర్తి పీహెచ్సీలో ఆకస్మిక తనిఖీ
– సమయపాలన పాటించని సిబ్బంది
– సిబ్బంది పై చర్యలకు సిఫారసు చేసిన కలెక్టర్
నవతెలంగాణ-సంగెం
మండలంలోని కాపులకనపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందులు ఉండటాన్ని గమనించి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలకి ఆరోగ్య కేంద్రంలో ఒక ఆశ,ఒక ఏఎన్ఎం తప్ప మిగిలిన సిబ్బంది ఎవరు హాజరు కాలేదు. ఆ తర్వాత ఒక్కరొక్కరుగా విషయం తెలిసి విధులకు రావడం చూసి వారిపైన అసహనానికి గురయ్యారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు విధిగా విధి నిర్వహణలో ఉండాలని హెచ్చరించారు. అప్పుడే వచ్చిన డాక్టర్ యూనిఫామ్ ధరించకుండా సాధారణ దుస్తుల్లో రావడం, వైద్యానికి సంబంధించిన పలు ప్రశ్నలు కలెక్టర్ సంధించగా సరియైన సమాధానం చెప్పకపోయేసరికి అతన్ని మందలించారు.తనిఖీలో డాక్టర్స్, ఏఎన్ఎం విధులకు ఆలస్యంగా రావడం పై, పీహెచ్సీలో కాలం చెల్లిన మందులు ఉండడం పట్ల సిబ్బంది పై చర్యలు తీసుకోవలసిందిగా డిఎం అండ్ హెచ్ ఓ సాంబశివరావు ను ఆమె ఆదేశించారు.

- Advertisement -