– దోపిడీ చేస్తున్న కాటన్ మిల్లుల పై చర్యలు తీసుకునే సత్తా ఉందా
– సిసిఐ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పించాలి
– బి ఆర్ యస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున్ రెడ్డి
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
పత్తి రైతుల అవసరాన్ని ఆసరాగా తీసుకొని కొనుగోళ్లలో తక్కువ ధర చెల్లిస్తే సహించేది లేదని బి ఆర్ యస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున్ రెడ్డి అన్నారు. మంగళవారం హుస్నాబాద్ మండలంలోని పందిల్ల గ్రామ పరిధిలోని బాలాజీ కాటన్ మిల్లులో బిఆర్ఎస్ నాయకులు పత్తి కొనుగోల్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ మద్దతు ధర రూ 8100 ఉంటే కేవలం రూ 4500 నుoడి రూ 5500 మాత్రమే కొనుగోలు చేస్తున్నారన్నారు. పత్తి లో తేమ శాతం, గింజలు ఎక్కువ ఉన్నాయని సాకులతో తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారన్నారు.
రైతులు అనేక పెట్టుబడులు పెట్టి కష్ట నష్టాలు ఓర్చుకొని పత్తి పంట ను పండిస్తే పత్తి వ్యాపారులు తక్కువ ధర చెల్లించి రైతులను నిలువునా ముంచుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే సి సి ఐ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రైతులను దోపిడీ చేస్తున్న కాటన్ మిల్లుల యజమానుల పై చర్యలు తీసుకునే పరిస్థితి ప్రభుత్వనికి ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొని తిరగడం తప్ప రైతులను ఆదుకోవడం లో పూర్తిగా విఫలం అయిందన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ యస్ పార్టీ నాయకులు మల్కి రెడ్డి మోహన్ రెడ్డి ,మేకల వికాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
పత్తి రైతులను దోపిడీ చేస్తే సహించేది లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES