- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తమిళనాడు సాతూర్‌లోని బాణసంచా కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు మృతి చెందగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఐదు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో బాణసంచా కేంద్రంలో జరిగిన పేలుడులో 8 మంది మరణించారు.
- Advertisement -