Thursday, December 18, 2025
E-PAPER
Homeజాతీయంఎస్‌ఐఆర్‌ గణన ఫారమ్‌ల సమర్పణ తేదీని పొడిగించండి: సుప్రీంకోర్టు

ఎస్‌ఐఆర్‌ గణన ఫారమ్‌ల సమర్పణ తేదీని పొడిగించండి: సుప్రీంకోర్టు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఎస్‌ఐఆర్‌ గణన ఫారమ్‌ల సమర్పణ తేదీని పొడిగించాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)ని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. ఉత్తరప్రదేశ్‌, కేరళ సహా వివిధ రాష్ట్రాల్లోని వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, ఎస్‌ఐఆర్‌ 2026 ఓటర్ల జాబితా కింద గణన ఫారమ్‌ల సమర్పణ తేదీని పొడిగించాలన్న అభ్యర్థనలపై సానుభూతి దృక్పథంతో నిర్ణయం తీసుకోవాలని ఈసీఐని సుప్రీంకోర్టు కోరింది. ఎస్‌ఐఆర్‌ రాజ్యాంగ బద్ధతపై విచారణను 2026 జనవరి 6కి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోమాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

కేరళ షెడ్యూల్‌ను ముందుగా సవరించారు. గణన గడువును డిసెంబర్‌ 18కి వాయిదా వేశారు. అలాగే ముసాయిదా ఓటరు జాబితాను డిసెంబర్‌ 23న ఈసీఐ ప్రచురించనుంది. అయితే ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి వస్తే.. సవరించిన తుది గడువు డిసెంబర్‌ 26తో ముగియనుంది. ఈ అంశాలను సీనియర్‌ న్యాయవాదులు సుప్రీంకోర్టులో లేవనెత్తారు.

2027లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి వుండగా, ఇంత ముందుగా ఈ ప్రక్రియను ఎందుకు నిర్వహించారని బారాబంకి ఎంపీ తనుజ్‌ పూనియా సహా యూపీ ఎస్‌ఐఆర్‌ను సవాలు చేస్తున్న పిటిషనర్ల తరపున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూత్రా ప్రశ్నించారు. ముసాయిదా జాబితా నుండి 25 లక్షల మంది ఓటర్లు తొలగించబడనున్నారని కేరళ తరపున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో గణన దశకు చివరి తేదీ డిసెంబర్‌ 18 అని అన్నారు. జాబితాలో భర్తను మినహాయించారని, భార్యను చేర్చారని, అధికారులకు ఈ విషయం తెలిస్తే.. వారు భార్యను కూడా తొలగిస్తారని అన్నారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణను శీతాకాలపు సెలవుల తర్వాత, జనవరి 6న చేపడతామని ఆదేశించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -