- Advertisement -
అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో(ఏటిసి) వివిధ కోర్సుల ప్రవేశాల గడువు ఈ నెల 28 వరకు పెంపు.
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
యువతకు ఉపాధి కల్పించడంలో భాగంగా టాటా టెక్నాలజీ సహకారంతో యువతకి ఆదునాతన ఇండస్ట్రీ 4.0 కోర్సులను ప్రభుత్వం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హుజూర్నగర్ లోని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ లో 2025- 27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల గడువును ఈ నెల 28 వరకు పెంచడం జరిగిందని, ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకొని ఉపాధి పొందాలని కలెక్టర్ కోరారు.
- Advertisement -