- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్న దిగువ స్థాయి గాలుల వల్ల రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల మధ్యే కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
- Advertisement -



