Thursday, March 12, 2026
E-PAPER
Homeఖమ్మంసీతారాముల కుటుంబ సభ్యులకు నేత్రదానం సర్టిఫికెట్ అందజేత 

సీతారాముల కుటుంబ సభ్యులకు నేత్రదానం సర్టిఫికెట్ అందజేత 

- Advertisement -

నవతెలంగాణ – బోనకల్ : మండల పరిధిలోని చొప్పకట్ల పాలెం గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు ఆవుల సీతారాములు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు సీతారాములు కళ్ళను ఖమ్మం నేతల నిధికి అదే రోజు అందజేశారు. సీతారాములు దశదిన కర్మ గురువారం చొప్పకట్లపాలెంలో జరిగింది. ఈ సందర్భంగా సీతారాములు నేత్రదానంకు సంబంధించిన మెమెంటో, సర్టిఫికెట్లను కుమారులు ఆవుల లక్ష్మీనారాయణ ఆవుల నాగేశ్వరరావులకు ఆ గ్రామ ఉపసర్పంచ్ పల్లా కొండలరావు, నేత్ర నిధి నిర్వాహకులు చలమల అజయ్ కుమార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో  మాజీ సర్పంచ్ బూసి వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎం) కన్వీనర్ చలమల అజయ్ కుమార్, ఆవుల లక్ష్మీనారాయణ, ఆవుల నాగేశ్వరరావు, ఉపేందర్, అనిల్, ఖమ్మం నేత్రనిధి టెక్నిషియన్ మందా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -