– టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన సేవల్ని అందించేందుకు ప్రతి బుధవారం అధికారులు ఆయా బస్తీల్లో పర్యటిస్తూ, వారితో ముఖాముఖి కార్యక్రమాలు చేపట్టాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) సీఎమ్‌డీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశించారు. సోమవారంనాడిక్కడి డిస్కం ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఇంజినీర్లు, సూపరిటెండింగ్ ఇంజినీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆధారిత సేవల్ని అందుబాటులోకి తేచ్చేలా ప్రణాళికలు రూపొందించామనీ, వాటి అమలుకు అధికారులు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఫీడర్ల వారీగా విద్యుత్ సరఫరా పర్యవేక్షణ చేయాలనీ, డిమాండ్ – సరఫరా – అంతరాయాలు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి సంబంధిత ఇంజినీర్లను అప్రమత్తం చేయాలన్నారు. సమావేశంలో డైరెక్టర్లు వీ శివాజీ, డాక్టర్ నర్సింహులు, సీహెచ్ చక్రపాణి, పీ కృష్ణారెడ్డి, జోనల్ చీఫ్ ఇంజినీర్లు కే సాయిబాబా, ఎల్ పాండ్య, యు.బాలస్వామి, ఏ కామేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి బుధవారం వినియోగదారులతో ముఖాముఖి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES