Wednesday, December 10, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబూటకపు ఎన్‌కౌంటర్లు విచారకరం

బూటకపు ఎన్‌కౌంటర్లు విచారకరం

- Advertisement -

– కేంద్రం విధానాలు జంగిల్‌ రాజ్‌ పాలనకు పరాకాష్ట : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

బూటకపు ఎన్‌కౌంటర్ల ద్వారా మావోయిస్టులను చంపడం విచారకరమనీ, కేంద్ర ప్రభుత్వ విధానాలు జంగిల్‌ రాజ్‌ పాలనకు పరాకాష్ట అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. మంగళవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మావోయిస్టులను చంపుకుంటూ పోవడమంటే మానవ హననమేని స్పష్టం చేశారు.
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల పోలీసులు కూడా ఇందులో పావులుగా మారారని ఆయన పేర్కొన్నారు. మారేడుమిల్లిలో జరిగిన హిడ్మా ఎన్‌కౌంటర్‌, అంతకంటే ముందు మావోయిస్టులపై జరిగిన ఎన్‌కౌంటర్లు మొత్తం కూడా బూటకమేనని తెలిపారు. మనుషులను చంపుకునే వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదనీ, మావోయిస్టులు ఏదైనా నేరం చేసి ఉంటే అరెస్టు చేసి చట్టబద్ధంగా విచారణ జరిపించాలని సూచించారు. మావోయిస్టులపై జరుగుతున్న ఎన్‌కౌంటర్లపై విచారణ జరిపించాలని కూనంనేని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -