- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తన పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్‌బుక్ ఖాతా సృష్టించారని హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ తెలిపారు. ఆపదలో ఉన్నానని.. డబ్బులు పంపాలని మోసపూరిత మెసేజ్‌లు పంపిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ఓ స్నేహితుడు నిజమని నమ్మి రూ.20 వేలు పంపి మోసపోయారని చెప్పారు. డబ్బులు పంపాలని వచ్చే మెసేజ్‌లను ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద లింక్‌లు, మెసేజ్‌లు, వీడియో కాల్స్ వస్తే బ్లాక్ చేయాలని సూచించారు. ఆయా సైట్లు బ్లాక్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.
- Advertisement -



