నవతెలంగాణ – హైదరాబాద్ : కుటుంబ కలహాలతో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలిసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీనివాస్‌గౌడ్‌కు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు 12 ఏండ్ల క్రితం మరణించాడు. చిన్న కుమారుడు విశాల్‌గౌడ్(28) టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తూ.. 2023లో నవ్య అనే యువతిని వివాహం చేసుకున్నాడు. భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుడేవి. చాలసార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగి.. ఒక్కటైనా కూడా మళ్లీ విభేదాలు తలెత్తాయి. ఈ ఏడాది మార్చిలో నవ్య తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి తిరిగి రాలేదు. రెండు నెలల క్రితం నవ్య ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసుల నుంచి విశాల్‌గౌడ్‌కు ఫోన్ రావడంతో కౌన్సెలింగ్‌కు హాజరయ్యాడు. అనంతరం కేసు నమోదు కావడంతో స్టేషన్‌కు రమ్మని మరోసారి ఉప్పల్ పోలీసులు ఫోన్ చేశారు. ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం ఉదయం తన గదిలోకి వెళ్లి బయటకు రాకపోవడంతో అనుమానంతో కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి చూడగా.. ఫ్యాన్‌కు ఉరి వేసుకొని విశాల్‌గౌడ్ చనిపోయాడు.
కుటుంబ కలహాలు.. ఐటీ ఉద్యోగి ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -



