మండల వ్వవసాయాధికారీ మహేశ్వరి..
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పెద్ద ఏడ్గీ క్లస్టర్ పరిధిలో గురువారం పామ్ ఆయిల్ పంటలపై రైతులకు అవగాహన కార్యక్రమం ఏ ఈ ఓ సులోచన ఆధ్వర్యంలో రైతు వేదికలో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ పాల్గొని మహేశ్వరి పాల్గొని పామాయిల్ పంటల పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పామ్ ఆయిల్ పంట లాభదాయకంగా ఉంటుందని రైతులు వాణిజ్య పంటలపై దృష్టి కేంద్రీకరిస్తే అనుకున్న స్థాయిలో లాభాలు ఎల్లప్పుడూ ఉంటాయని రైతు అభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందిస్తుందని అన్నారు. ప్రస్తుతం మార్కెట్లో పామాయిల్ పంట వేస్తున్న రైతులు ఆర్థికంగా బలంగా ఉన్నారని తెలిపారు. ఒకానొక సమయంలో ఏ పంటలు పండించిన లాభాలు లేవని రైతులు గ్రామాలు విడిచి పట్టణాలకు వలస వెళ్లే వారిని పామాయిల్ అంట వచ్చిన తర్వాత తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందుతున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఏవో మహేశ్వరి, ఏఈఓ సులోచన, జిఎం, హెచ్ ఓ, పామాయిల్ రైతులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
ఫామ్ ఆయిల్ పంట లాభదాయకంగా ఉంటుంది..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES