- Advertisement -
నవతెలంగాణ – కడెం
కడెం మండలంలోని కొండుకూర్ గ్రామానికి చెందిన సంజీవ్ రెడ్డి అనే రైతుకు చెందిన వరి పొలంలో కూలీకి వచ్చి మిషన్ తో గడ్డి కోస్తున్నాడు. ఈ క్రమంలో హై వోల్టేజ్ విద్యుత్ వైర్ కట్ అయి సంగం రాజు (37) అనే వ్యక్తి విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రాజు భార్య, రాజు తండ్రి ఘటన స్థలం వద్ద కన్నీరు మున్నిరైన్నారు. ఘటన స్థలాన్ని కడెం పోలీసులు సందర్శించి ప్రమాదం పట్ల విచారణ చేపడుతున్నారు.
- Advertisement -