Friday, March 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యుత్‌ షాక్‌తో రైతు మృతి

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి

- Advertisement -

నవతెలంగాణ-కంగ్టి
కరెంట్‌ షాక్‌ తగిలి రైతు మృతిచెందిన సంఘటన మండలంలోని చాప్ట (బి) గ్రామంలో జరిగింది. ఎస్‌ దుర్గారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాలాజీరావు (43) అనే రైతు తన పొలంలోని మొక్కజొన్న పంటకు వాగులో నీటిని మోటారు ద్వారా వదులుతున్నాడు. ఈ క్రమంలో రోజువారీ లాగానే గురువారం ఉదయం నీటిని పారబెట్టేందుకు మోటారు దగ్గరికి వెళ్లి స్టాటర్‌ ముట్టుకోవడంతో స్టాటర్‌లోని ఒకవైరు ప్రమాదవశత్తు తెగి కాలిపైన పడింది.

దాంతో విద్యుత్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వ్యవసాయమే వారి కుటుంబానికి జీవన ఆధారం కావడంతో ఇంటి పెద్దను కోల్పోయిన ఆ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని బంధువులు, గ్రామస్తులు కోరుతున్నారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -