నవతెలంగాణ – దుబ్బాక
చికిత్స పొందుతూ రైతు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని రాజక్కపేటలో జరిగింది. దుబ్బాక ఎస్ఐ కీర్తిరాజు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ముదిగొండ రాజేశం (55) కిరాణా దుకాణంతో పాటు వ్యవసాయం చేస్తూ భార్య, ఇద్దరు కుమార్తెలతో జీవనం కొనసాగిస్తున్నాడు. ఆదివారం కిరాణా సామాన్లు కొనుగోలు చేసేందుకు భార్య తో కలిసి తన టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై దుబ్బాకకు వచ్చాడు. అనంతరం తిరుగు ప్రయాణంలో మున్సిపల్ పరిధి చెల్లాపూర్ వార్డు శివారులోని ఐకేపీ కేంద్రం సమీపంలో గల ఓ చెట్టుకు తాడుతో కట్టేసిన గేదె రోడ్డు మధ్యలోకి అడ్డుగా వచ్చింది. గేదెకు కట్టి ఉన్న తాడు ఎక్సెల్ వాహనంలో ఇరుక్కుపోవడంతో దంపతులిద్దరూ కింద పడ్డారు.
దీంతో రాజేశం తల వెనుక భాగంలో తీవ్ర గాయాలు కాగా భార్య చంద్రకళ కాలికి గాయం అయింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది రాజేశం ను సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి అక్కడి నుంచి హైదరాబాదులోని యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామన రాజేశం మృతి చెందాడు. భార్య చంద్రకళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
చికిత్స పొందుతూ రైతు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES