Wednesday, January 7, 2026
E-PAPER
HomeNewsశ్రీనివాసపురంలో రైతు రిజిస్ట్రీ నమోదు పూర్తి

శ్రీనివాసపురంలో రైతు రిజిస్ట్రీ నమోదు పూర్తి

- Advertisement -

నవతెలంగాణ –ఆలేరు రూరల్

ఆలేరు మండలం శ్రీనివాసపురం గ్రామంలో సోమవారం రోజున రైతు రిజిస్ట్రీ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.రైతులకు పీఎం కిసాన్‌తో పాటు ప్రభుత్వ ఇతర సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకు రైతు రిజిస్ట్రీ ముఖ్యమైనదని నిర్వాహకులు తెలిపారు.గ్రామంలో దాదాపు 80 శాతం మంది రైతులకు రైతు రిజిస్ట్రీ నమోదు పూర్తయింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వడ్ల శోభన్ బాబు,ఉప సర్పంచ్ గడ్డం ఇస్తారు,వార్డు సభ్యులు పోతారం కనకయ్య,చౌడబోయిన ఆంజనేయులు,చౌడబోయిన పోచమణి కనకయ్య,చౌడబోయిన లావణ్య రవి పాల్గొన్నారు.అలాగే రైతులు చౌడబోయిన పరశురాములు, స్వామి సతీష్,ఇస్తారి ఆంజనేయులు, కొత్తపల్లి పోచయ్యతో పాటు ఏఈఓ  కార్యక్రమంలో పాల్గొని రైతులకు అవసరమైన సూచనలు అందించారు.రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -