ముఖ్యమంత్రి కి రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
నల్లమల్ల ప్రజలు చైతన్యంతో తరలివచ్చారు:మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
నవతెలంగాణ – అచ్చంపేట
ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇప్పటికి 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం అచ్చంపేట పట్టణంలో ఓ ఫంక్షన్ హాల్ లో భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్ ) కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. 25 ఏళ్ల ప్రస్థానం ప్రాధాన్యత కలిగిన బిఆర్ఎస్ పార్టీ కీ రాష్ట్ర ప్రజలు 10 ఏళ్లు అధికారం ఇచ్చారన్నారు.
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఢిల్లీలో రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. బీసీలకు 42 శాతం ఢిల్లీలో ధర్నా భూటకం అన్నారు. హామీలు ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు.100 కోట్ల చాప పిల్లల పంపిణీ ఎక్కడ చేశారని, మహిళలకు ప్రతినెల 25 రూపాయలు ఎక్కడ ఇస్తున్నారని ప్రశ్నించారు.
నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. గువ్వల బాలరాజు రాజీనామా చేసి తన రాజకీయ జీవితాన్ని స్మశానం చేసుకున్నాడని అన్నారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ను గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ గువ్వల బాలరాజు స్థానికుడు కాకపోయినప్పటికీ అచ్చంపేట ప్రజలు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించాలని అలాంటి ప్రజలను కాదని ఈరోజు పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు.
బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. నల్లమల్ల ప్రజలు గువ్వల బాలరాజు పై ఎంతో ప్రేమ ఆప్యాయత చూపించారాని, ఎమ్మెల్యేగా ఓడిపోగానే.. ఓట్లు వేసిన ప్రజలను మరచిపోయి సొంత లాభం కోసం బిజెపి పార్టీలోకి వెళుతున్నాడని అన్నారు. నల్లమల్ల ప్రాంతంలో పులులు ఉంటాయి ఆ తరహాలో కార్యకర్తలు సమావేశానికి తరలివచ్చారని.. ఈ ప్రాంత ప్రజలు త్వరలోనే గోల బాలరాజుకు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. అంతకుముందు స్థానిక నాయకులు కార్యకర్తలు మాట్లాడుతూ.. గువ్వల బాలరాజు 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన అరాచకాల వల్ల మాత్మ అభిమానులు దెబ్బతిశాయన్నారు.
నాయకులను కార్యకర్తలను క్షోభ పెట్టారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక జెడ్పిటిసి ఎన్నికలలో అచ్చంపేట నియోజకవర్గం లో 8 జడ్పిటిసి స్థానాలు, 8 ఎంపిటిసి స్థానాలు బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తామని స్థానిక నాయకులు భరోసా ఇచ్చారు. మాజీ మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్ మాట్లాడుతూ గువ్వల బాలరాజు కోసం 2 ఏళ్లు చైర్మన్ పదవి ఉన్నప్పటికీ రాజీనామా చేసి పదవి వదులుకున్నానని అన్నారు. కార్యక్రమంలో కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, స్థానిక నాయకులు పోకల మనోహర్, రమేష్ రావు, పర్వతాలు, తులసి రామ్, సేవ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.