నవతెలంగాణ – కంఠేశ్వర్: వరదల వలన నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ(ఎం) పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ఇటీవల జిల్లాలో కురిసిన వర్షాలతో పాటు వరదల వలన నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారాన్ని, ఆస్తి నష్టాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ.. ఇటీవల ప్రకృతి బీభత్సంతో నష్టపోయిన రైతులను ఆయా గ్రామాల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 5 బృందాలుగా పర్యటించి పంటలను పరిశీలించటం జరిగిందని, ప్రధానంగా నిజాంసాగర్ వరద నీటిని పెద్ద ఎత్తున వదలటంతో కాలువలు ఉప్పొంగి నిజాంసాగర్ కెనాల్ ప్రాంతాల్లో అనేకమంది రైతుల వరి పంట నీట మునిగి పంట చేతికి రాకుండా పోతుందని అదేవిధంగా నిజాంసాగర్ వరదనీటితోపాటు లేండి కౌలాస్నాల తదితర ప్రాజెక్టుల నుండి వచ్చిన నీటితో నది ఉప్పొంగి వేలాది ఎకరాల రైతుల పంటలు మునిగి 10 మీటర్ల వరకు నీరు పేరు పోయిందని పోతంగల్, బోధన్, నవీపేట్ మండలాల్లోని కొన్ని గ్రామాలకు పూర్తిగా రహదారులు మూసివేయడంతో పాటు ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు అవస్థలు ఎదుర్కొన్నారని. మంజీరా నది తో పాటు హరిద్ర నది, గోదావరిలో కలవడంతో గత 40 సంవత్సరాల చూడని వరద నీటితో గోదావరి నది పరిసర రైతుల పంటలు వేలాది ఎకరాలు పది మీటర్లకు పైగా చేరుకోరటంతో వరితో పాటు సోయాబీన్ ఇతర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి అదేవిధంగా నవీపేట్ ఎర్ర గట్ల మండలాల్లోని కొన్ని గ్రామాలకు పూర్తిగా మీరు చేరటంతో బయటకు రావటానికి ప్రజలు అవస్థలు పడ్డారు.
ఈ అకాల వర్షాల వలన వేల్పు రు భీమ్గల్ ,సిరికొండ ,ధర్పల్లి మండలాల్లో వాగులు చెరువులు కట్టలు తెగటంతో రైతుల పొలాల్లో ఇసుక మేటలు పేరుకుపోయి ఎకరాల పంట నష్టం జరిగింది ధర్పల్లి సిరికొండ మండలాల్లోని రెండు గ్రామాలలో ఇళ్లల్లోకి నీరు చేరి రెండడుగుల పైన మట్టి పేరుకు పోయి ప్రజలు సర్వస్వం కోల్పోయారు. నవీపేట్ మండలం కోస్లి గ్రామంలో ఒక రైతు కోళ్ల నీటిలో మునిగి తీవ్రమైన ఆర్థిక నష్టం జరిగింది. అదేవిధంగా రైతుల బోర్ బావుల్లో మోటర్లు నీరు చేరుకోవటంతో ఏ పరిస్థితికి వచ్చాయి చెరువులు కాలువలు నదులు ఉప్పొంగటంతో రోడ్లు ధ్వంసమై రహదారి దెబ్బతిన్నాయి. మొత్తంగా జిల్లాలో 40,000 పైగా ఎకరాల పంటలు దెబ్బతిన్నాయని అందువల్ల ప్రతి రైతుకు ఎకరానికి 25 వేల రూపాయల పరిహారాన్ని చెల్లించటం తో పాటు రుణాలు మాఫీ చేసి రీ షెడ్యూల్ చేయాలని, ఇండ్లు కూలిన వారికి పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు 50వేల రూపాయలు, పూర్తిగా ధ్వంసమైన ఇళ్లకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించటం తో పాటు వరదలు వలన ఇండ్లలోకి నీరు చేరి బురద పేరుకుపోయిన ప్రతి కుటుంబానికి ఆస్తి నష్టాన్ని 50 వేల రూపాయలు చెల్లించాలని అదేవిధంగా వరద నీరు చేరిన ప్రతి ఇంటికి పదివేల రూపాయలు సహకారాన్ని అందించాలని వారం రోజులుగా ఉపాధి లేకుండా ఉన్న వ్యవసాయ కూలీలకు పనికి 5000 రూపాయలు ఆర్థిక సహకారాన్ని అందించాలని తద్వారా జిల్లా వ్యాప్తంగా సుమారు పదివేల కోట్ల రూపాయల నష్టం జరిగినట్లుగా వారు తెలిపారు. ప్రభుత్వం వెంటనే తాత్సారం చేయకుండా వెంటనే నష్టపరిహారాన్ని చెల్లించని యెడల ఆందోళన చేయాల్సి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, జిల్లా కమిటీ సభ్యులు బి. సుజాత, నగర కమిటీ సభ్యులు, నల్వాల నరసయ్య, కటారి రాములు తదితరులు పాల్గొన్నారు.