- Advertisement -
- – పిచ్చి మొక్కలను తొలగిస్తున్న రైతు
- – పిచ్చి మొక్కలతో నిండిపోయిన వడ్ల కొనుగోలు కేంద్రం
నవతెలంగాణ _బొమ్మలరామారం : పంట సాగు చేసినప్పటి నుంచి చేతికొచ్చేవరకు అన్నదాతలకు అన్ని కష్టాలే. బొమ్మలరామారం మండలంలోని మర్యాల గ్రామంలో కొనుగోలు కేంద్రం పిచ్చి మొక్కలతో నిండిపోయింది.చుట్టుపక్కల రైతులు, గ్రామస్తులు నేరుగా కొనుగోలు కేంద్రానికి వచ్చి పిచ్చి మొక్కలు తొలగించవలసి పరిస్థితి వచ్చిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి మరమత్తులు నోచుకోకుండా అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకుని వచ్చిన ఎలాంటి సౌకర్యాలు లేవని త్వరగా సమస్య పరిష్కరించాలని అన్నారు.ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కోసి ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొని రాగా పిచ్చి మొక్కులతో ఉండడంతో రైతులే తలా ఒక చెయ్యి వేసి పిచ్చి మొక్కలను తొలగించారు.
- Advertisement -