Tuesday, November 4, 2025
E-PAPER
Homeఆదిలాబాద్కాపాస్ కిసాన్ యాప్ పై రైతులకు అవగాహన..

కాపాస్ కిసాన్ యాప్ పై రైతులకు అవగాహన..

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్
మండల కేంద్రమైన కుభీర్ వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో సోమవారం మండల రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బైంసా ఆత్మ కమిటీ చెర్మన్ సిద్ధం వివేకనంద్ అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ .. మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు చెందిన రైతులు తప్పనిసరిగా మార్కెట్ కు తీసుకువచ్చే ముందు కాపాస్ కిసాన్ యాప్ లో స్లాట్ బుకింగ్ చేసుకొని ఆ తరవాత ప్రభుత్వం కొనుగోళ్లు చేసే సీసీఐ ద్వారా పత్తి ని కొనుగోళ్లు చేస్తారు. లేదంటే రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్క రైతు కాపాస్ కిసాన్ యాప్ లో నమోదు చేసుకొని ఆధార్ కార్డు కు అనుసంధానమైన ఫోన్ పట్టా పాస్ బుక్ తీసుకువచ్చి కొనుగోళ్లు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సారిక వ్యవసాయ విస్తీర్ణ అధికారులు రైతులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -