Friday, January 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డ్రమ్ సీడర్ పద్ధతిపై రైతులకు అవగాహన

డ్రమ్ సీడర్ పద్ధతిపై రైతులకు అవగాహన

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
వేల్పూరు మండలం పడగల్ గ్రామంలో సుస్థిర వ్యవసాయ కేంద్రం ఆధ్వర్యంలో డ్రమ్ సీడర్ పద్ధతి, వరి విత్తనాలు నేరుగా వేదచల్లుటపై సోమవారం రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుస్థిర వ్యవసాయ కేంద్రం ప్రతినిధి చింత శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో రైతులకు డ్రమ్ సీడర్ పద్ధతి, వరి విత్తనాలు నేరుగా వేదచల్లుటపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రమ్ సీడర్ పద్ధతితో కూలీల ఖర్చు తగ్గుతుందన్నారు. వ్యవసాయంలో అధునాతన పద్ధతులను అవలంబిస్తే పెట్టుబడులు తగ్గి వ్యవసాయ దిగుబడులు పెరుగుతాయన్నారు.

ఈ పద్ధతి ద్వారా విత్తనాలు మోతదు తక్కువ, ఖర్చు తక్కువ, వరి నారు పోయడం, నాట్లు వేయడం, కూలీల భారం ఉండదని రైతులకు వివరించారు.  కార్యక్రమంలో సుస్థిర వ్యవసాయ కేంద్రం ప్రతినిధులు  భార్గవ్, శ్రీకాంత్, గ్రామ రైతులు సబరీష్, పరమేష్, రాజేశ్వర్, గంగారెడ్డి, రవీందర్, మహేందర్  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -