రాత్రి నుండి లైన్ లోనే రైతన్నలు
420 సంచుల సరఫరకు, 1000 మంది రైతుల లైన్
నవతెలంగాణ – రామారెడ్డి
పంటలు పండించడానికి రైతు ఎంత కష్టపడుతున్నాడో, యూరియా కోసం అంతే కష్టపడుతున్నాడు. ఉదయం ఇచ్చే టోకెన్ల కోసం, రాత్రి నుండే రైతు వేదిక వద్ద పండుకొని లైన్లో ఉండడం రైతన్న పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుంది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో అత్యధికంగా వరి పంటను సాగు చేస్తారు. పొట్టదశకు రావడంతో ఎరువులు అందించలేకపోవడంతో, దిగుబడి తగ్గే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద మద్దికుంట, రామారెడ్డి తో పాటు వివిధ గ్రామాల రైతులు రాత్రి నుండి లైన్ లో పండుకొని, ఉదయం టోకెన్లు లభిస్తాయి అనుకున్న రైతులకు నిరాశ ఎదురయింది. 420 బస్తాలకు 1000 మంది రైతులు లైన్లో నిలబడ్డారు. అధికారులు టోకెన్లు అందిస్తున్న సమయంలో తోపులాట జరగడంతో, అధికారులు టోకెన్లు ఇవ్వడం బంద్ చేయడంతో, రైతులు ఆందోళనకు దిగారు. చివరకు ముఖ్యమంత్రి బందోబస్తులో ఉన్న ఎస్సై లావణ్య వచ్చి, రైతులను సముదాయించి, పోలీసులతోనే టోకెన్లను పంపిణీ చేశారు. రైతులకు సరిపడే యూరియాను సరైన సమయంలో అందించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
యూరియా కోసం రేయింబవళ్ళు రైతుల పాట్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES