-మండలంలో మొంథా తుఫాన్ ప్రభావం
-సుమారు 75 మీ.మీ వర్షపాతం నమోదు
-కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
-చేలల్లో తడిసి ముద్దయిన పత్తి
నవతెలంగాణ-బెజ్జంకి : పంటలపై రైతులు పెట్టుకున్న ఆశలు ఆవిరవుతున్నాయి.బుధవారం మండలంలో మొంథా తుఫాన్ కొనసాగింది.తుఫాన్ వల్ల మండల కేంద్రంతో పాటు అయా గ్రామాల్లో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పాక్షికంగా తడిసిపోయింది.తుఫాన్ పంటలపై ప్రభావం చూపింది.మండలంలో సుమారు 75 మీ.మీ వర్షపాతం నమోదైనట్టు తహసిల్దార్ శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
పత్తిపై ఆశలు ఆవిరి..
పత్తి సాగు చేసిన రైతులపై ప్రకృతి తన ప్రతాపం చూపిస్తోంది.గత కొద్దిరోజుల క్రితం యూరియా కొరతతో ఇబ్బందులు పడ్డ పత్తి రైతులు పడిగాపులు గాసి పత్తి పంటను పరిరక్షించుకున్నారు.ఆరకొరగా వచ్చిన పత్తి దిగుబడిపై ఆశలు పెట్టుకున్న క్రమంలో తుఫాన్ రైతుల ఆశలను ఆవిరి చేసింది.దీంతో పంట చేనులో ఉన్న పత్తి దిగుబడి వర్షానికి తడిసి ముద్దదైంది.
ప్రభుత్వం రైతులను అదూకోవాలి
ఈ యేడు రైతులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.ఎన్నో ఆశలతో పంటలు సాగు చేస్తే ఆశించిన పంట దిగుబడులచ్చే పరిస్థితి లేదు.గత కొద్ది నెలల క్రితం కురిసిన అకాల వర్షాలు నష్టపర్చాయి.పెట్టుబడులైనా వస్తాయని ఆరకొరగా మిగిలిన పంటలను కాపాడుకుంటే మొంథా తుఫాన్ పంట దిగుబడులపై ప్రభావం చూపింది.రైతులను ప్రభుత్వం అదూకోవాలి.పత్తి క్వింటాళుకు సుమారు రూ.12 వేలు మద్దతు ధర ప్రకటించి కొనుగొలు చేయాలి.కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.
-తిప్పారపు శ్రీనివాస్, సీపీఐ(ఎం)మండల కార్యదర్శి,బెజ్జంకి




