Saturday, November 8, 2025
E-PAPER
Homeతాజా వార్తలురైతు శ్రమ..అగ్నికి ఆహుతి

రైతు శ్రమ..అగ్నికి ఆహుతి

- Advertisement -
  • – మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు పత్తి దగ్దం
    – పరిసర ప్రాంతాలను కమ్ముకున్న దట్టమైన పొగ 
  • – మంటలను అదుపుచేసిన అగ్నిమాపక సిబ్బంది
  • – కంటతడి పెట్టిన రైతు కుటుంబ సభ్యులు
  • నవతెలంగాణ – బెజ్జంకి
  • ఆరుగాలం శ్రమించి పత్తి సాగు చేసిన రైతు శ్రమ అగ్నికి అహుతైంది. శనివారం మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు నిప్పంటుకుని పత్తి దగ్దమవ్వడంతో రైతుకు భారీగా నష్టం వాటిల్లింది. దగ్దమవుతున్న పత్తి పరిసర ప్రాంతం దట్టమైన పొగతో కమ్ముకుంది. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ సౌజన్య  పోలీస్ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని స్థానికుల పరస్పర సహకారంతో మంటలను అదుపుచేసేందుకు తీవ్రంగా యత్నించారు. మంటలు అదుపులోకి రాక విస్తరిస్తుండడంతో అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చి ఆర్పివేశారు.సీఐ శ్రీను సంఘటన స్థలాన్ని సందర్శించి పర్యవేక్షించారు. అగ్నిమాపక శకటం వచ్చినప్పటికి చాల వరకు పత్తి దగ్దమై రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది. అరబెట్టిన సుమారు 350 క్వింటాళ్ల పత్తి దిగుబడి పూర్తిస్థాయిలో కాలి బూడిదవ్వడంతో రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది.

రైతు కుటుంబం కంటతడి..
మండల కేంద్రానికి చెందిన రైతు బండి ఐలయ్య తన పత్తి దిగుబడిని ఇంటి వెనక ప్రాంతంలో అరబేట్టాడు. అరబేట్టిన పత్తి ప్రమాదవశాత్తు అగ్నికి అహుతవుతుండడంతో రైతు కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మంటలను అదుపు చేసినా.. అధికశాతం పత్తి కాలి బూడిదై.. రంగు మారి మసకబారడంతో తీవ్రంగా నష్టపోయామని రైతు కుటుంబ సభ్యులు కంటతడిపెట్టాయి. మంచిధర లభిస్తుందని దాచుకున్న పత్తి దిగుబడి అగ్నికి అహుతవ్వడంతో ప్రభుత్వం అదూకోవాలని బాధిత రైతు కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ప్రమాద ఘటనపై బాధిత రైతు బండి ఐలయ్య పోలీస్ స్టేషన్ యందు ఫిర్యాదు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -