నవతెలంగాణ ఆలేరు టౌను: ఆలేరు పట్టణంలో బుధవారం పోచమ్మ గుడి రోడ్డులో, రైతులకు కలుపు మందు నిరోధక నకిలీ పత్తి విత్తనాల సాగువలన కలిగే దుష్పరిణామాలపై, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో, మండల వ్యవసాయ అధికారి ఎస్ శ్రీనివాస్, ఎస్ఐ, ఎన్.వినయ్ కుమార్ తో కలిసి అవగాహన కల్పించారు.
కలుపు మందు నిరోధక పత్తి ( హాట్ కాటన్ ) విత్తనాల సాగు వలన కలిగే దుష్పరిణామాలపై మండల వ్యవసాయ అధికారిగా శ్రీనివాస్, ఎస్ ఐ ఎన్ వినయ్ మాట్లాడుతూ రైతులు కలుపు మందు నిరోధక పత్తి విత్తనాలను(హాట్ కాటన్ )ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయరాదని, ఎవరైనా అటువంటి విత్తనాలు అమ్మినా, కొన్నా చట్టరీత్యా శిక్షార్హులనీ తెలియజేశారు. వీటిని అమ్మిన, కొనుగోలు చేసిన వ్యక్తుల వివరాలను తెలిసినవారు. పోలీసు, వ్యవసాయ శాఖలకు సమాచారం అందించాలని సూచించారు.
సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. ప్రభుత్వము హాట్ కాటన్ విత్తనాలను, గ్లైఫోసిట్ కలుపు మందును పూర్తిగా నిషేధించిందని చెప్పారు. ప్రభుత్వం నిషేధించిన ఈ పంట సాగుచేసిన మరియు నిషేధించిన కలుపు మందు వాడిన వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు.
ప్రభుత్వం నిషేధించిన ఈ విత్తనాలను విక్రయించిన మరియు కొన్న రైతుల పైన చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పత్తి విత్తనాలు ఎప్పుడైనా లైసెన్స్ ఉన్న అధీకృత డీలర్ వద్దనే కొనుగోలు చేయాలని, లూజు విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ శివకుమార్, పోలీసు సిబ్బంది రైతులు సిద్ధులు, గోపాల్ రెడ్డి, మల్లయ్య, శ్రీశైలం సిద్ధులు, నాగిరెడ్డి, నర్సయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.



