– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్య పద్మ
నవతెలంగాణ – కామారెడ్డి
రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్య పద్మ అన్నారు. కామారెడ్డి జిల్లా సిపిఐ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రైతుల సమస్యలు పరిష్కరించాలని, పంటలు నష్టపోయిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బేసిజాలకు పోకుండా, కామారెడ్డికి ఐదు కోట్ల 28 లక్షల నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కేవరాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఐదు కోట్ల 28 లక్షల రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చిన ఇప్పటివరకు ఏ ఒక్క రైతుకు కూడా అందలేదన్నారు. కామారెడ్డి జిల్లా లో పంటలు నష్టపోయిన జిల్లా రైతులను, గత ఆగస్టు నెలలో కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకుంటామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పడం జరిగిందన్నారు.
ఇప్పటివరకు ఎలాంటి నష్టపరిహారం రైతులకు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము కాలయాపన చేయడం జరిగిందన్నారు. ఇప్పటిక వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సీతక్క హామీ ఇచ్చి నెరవేర్చకపోవడం రైతులను చిన్నప్పుడు చూపు చూసినట్టనీ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఏఐకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ అన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి 50,000 రూపాయలు ఇవ్వాలని అలాగే ఎరువులను ప్రభుత్వము కోత లేకుండా ఫ్రీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేయాలని పంట చేతికొచ్చిన నష్టపోయిన రైతులను ఐదు లక్షలకు పైగా నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకొని రైతుల పండుగ ఉండాలన్నారు.
6 రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఎరువులు ఉచితంగా ఇవ్వాలని నష్టపోయిన రైతులను ఆదుకోవాలని పంట చేతికి వచ్చి మొన్న కురిసిన వర్షాలకు నష్టపోయిన జిల్లాలో నష్టపరిహారంగా ఎకరానికి 50 వేల రూపాయలు ప్రభుత్వము ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కంజర భూమన్న, సిపిఐ కామారెడ్డి జిల్లా కార్యదర్శి. ఎల్ దశరథ్ గారు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి. పి బాలరాజ్, తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు దేవయ్య, మోతే బాలరాజ్, సాయ గౌడ్, సాయిలు, హనుమాన్లు, ఎం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
రైతుల సమస్యలు పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES