నవతెలంగాణ – గోవిందరావుపేట
సీతక్క డౌన్ డౌన్ యూరియా కావాలి. యూరియా కోసం మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ముందు ఆదివారం రైతులు 163 వ జాతీయ రహదారిపై భారీ రాస్తారోకో నిర్వహించారు. సీతక్క డౌన్ డౌన్ యూరియా కావాలి అంటూ రైతులు పెద్ద పెట్టిన నినాదాలు చేశారు. స్థానిక పోలీసులు రాస్తారోకోను విరమించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.
యూరియా కోసం ఆగ్రహం జిల్లా రైతులు పోలీసులను సైతం ఎదురు ప్రశ్నించారు. మీరు రైతులైతే మీకు పంట పొలాలు ఉంటే రైతు బాధ ఏంది అనేది అర్థమవుతుంది అని రైతులు అన్నారు. యూరియా కొరతకు కారణం ఏదైనా ప్రస్తుతం రైతులు పడుతున్న బాధలు వర్ణనాతీతం అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి కాబట్టి రైతులు మంత్రిని బాధ్యుల్ని చేస్తున్నామని రైతులు పేర్కొన్నారు. ప్రతిరోజు ఏరియా కోసం పడుతున్న బాధలు ఎదుర్కొంటున్న కష్టాలు ఒక రైతుకు మాత్రమే అర్థమయితావని, అధికారులకు మంత్రులకు పోలీసులకు ఎంత మాత్రం అర్థం కాదని రైతులు ఆగ్రహంతో అన్నారు. యూరియా సకాలంలో అందడం లేదన్న బాధతోనే రైతుల ఆవేశం కట్టలు తెంచుకోవడం వల్లే రాస్తారోకి పూనుకున్నామని ఎవరి మీద తమకు కోపం లేదని రైతులు తెలుపుతున్నారు.
పరిస్థితి ఇలాగే కొనసాగితే ముందు ముందు మరిన్ని ఉద్యమాలు ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని రైతులు రైతు సంఘాల నాయకులు అంటున్నారు. చివరకు పోలీసులు సర్ది చెప్పడంతో రైతులు రాస్తారోకోను విరమించారు.