Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్యూరియా కోసం బారులు తీరిన రైతులు 

యూరియా కోసం బారులు తీరిన రైతులు 

- Advertisement -

పోలీస్ పహారాలో యూరియా పంపిణీ 
పెరిగిన మొక్కజొన్న విస్తీర్ణం 
యూరియా కోసం ఆందోళన వద్దు, ఏవో 
ఎమ్మెల్యే కృషివల్లే పాలకుర్తి మండలానికి యూరియా దిగుమతి, తొర్రూర్ సొసైటీ చైర్మన్ మైసి రెడ్డి 
రైతులను ఆదుకునేందుకే ప్రభుత్వం కృషి, పాలకుర్తి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ మంజుల 
నవతెలంగాణ – పాలకుర్తి

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రైతులు యూరియా కోసం బారులు తీరారు. యూరియా సమయానికి రాకపోవడంతో రైతులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. పంటల విస్తీర్ణం పెరగడంతో పాటు పంటలకు సరిపడా యూరియా దిగుమతి లేక యూరియా కొరత ఏర్పడుతుందని పలువురు రైతులు విమర్శిస్తున్నారు. యూరియాను సొసైటీలతోపాటు ఆగ్రోస్, గ్రోమోర్, ఎరువుల దుకాణాల్లో అందుబాటులో ఉండే విధంగా అధికారులు చర్యలు చేపడితే ఎలాంటి యూరియా కొరత ఉండదని రైతులు అభిప్రాయపడుతున్నారు. రైతులకు యూరియా ఇస్తున్నారని సమాచారాన్ని తెలుసుకున్న రైతులు మంగళవారం పాలకుర్తి సొసైటీ తో పాటు, ఆగ్రోస్ 2, ప్రో సొసైటీ ఆధ్వర్యంలో యూరియా పంపిణీ కేంద్రాల వద్ద రైతులు వందలాదిమంది బారులు తీరారు.

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఏరియా బస్తాలను తీసుకువెళ్లేందుకు పడిగాపులుకాశారు. పాలకుర్తి సొసైటీకి 444, ఆగ్రోస్ 2 సెంటర్ కు 111, తొర్రూర్ సొసైటీ క 222 యూరియా బస్తాలు అందుబాటులో ఉండడంతో రైతులు బారులు తీరారు. ఒక్కో రైతుకు ఆధార్ నమోదు తో పాటు వేలిముద్ర వేయించుకొని ఆన్లైన్ అయిన తర్వాతనే రెండు బస్తాల యూరియాను రైతులకు అందిస్తున్నారు. సర్వర్ రాక ఆన్లైన్ పనిచేయకపోతే రైతుల పరిస్థితి అంతే సంగతులు. సర్వర్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. పాలకుర్తి సొసైటీ ఆధ్వర్యంలో యూరియాను పోలీసుల పహారా మధ్య పంపిణీ చేశారు. రైతులకు సరిపడా యూరియా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది మొక్కజొన్న విస్తీర్ణం బాగా పెరగడంతో రైతులు యూరియాను ఎక్కువగా వాడుకుంటున్నారు. మొక్కజొన్న తో పాటు పత్తి పంటకు, వరి పంటకు యూరియా వేయాల్సిన సమయం ఒకేసారి రావడం వల్ల యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

ఎమ్మెల్యే కృషివల్లే పాలకుర్తికి యూరియా దిగుమతి : తొర్రూరు సొసైటీ చైర్మన్ గోనె మైసిరెడ్డి 

పాలకుర్తి రైతులకు యూరియా కొరత ఉండకూడదనే సంకల్పంతో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రత్యేక అదృష్టమే సాధించింది. ఎమ్మెల్యే కృషి వల్లనే పాలకుర్తికి సకాలంలో యూరియా దిగుమతి అవుతుంది. రైతులను ఆదుకోవడం లక్ష్యంగా ఎమ్మెల్యే పనిచేయడం అభినందనీయం. ప్రతిపక్షాల నాయకులు కావాలనే యూరియా రాజకీయాలు చేస్తున్నారు. రైతులకు యూరియా కొరత తీర్చాలని ఎమ్మెల్యేను కోరడంతో స్పందించి పాలకుర్తి మండలానికి యూరియా దిగుమతి అయ్యే విధంగా చర్యలు చేపట్టారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నారు. రైతులు వారి మోసపూరితమైన మాటలు నమ్మి మోసపోకూడదని విజ్ఞప్తి చేశారు. 

రైతులను ఆదుకోవడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం : పాలకుర్తి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లావుడియా మంజుల 

రైతులను ఆదుకునేందుకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో పాటు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం. పుండు ఓ చోట ఉంటే మందు మరోచోట అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీల విమర్శలు ఉన్నాయి. యూరియా కొరత కేంద్రం వద్ద ఉంటే ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ప్రభుత్వంపై నిందల వేయడం హాస్యాస్పదం. పాలకుర్తి రైతాంగానికి సరిపడా యూరియాను అందించేందుకు ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టడం వల్లనే మండలానికి యూరియా దిగుమతి అవుతుంది. ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ ప్రజా ప్రభుత్వం చేసి రైతులను ఆదుకున్నప్పుడు ప్రతిపక్షాలు ఎందుకు సంబరాలు చేసుకోలేదని ప్రశ్నించారు. యూరియా కొరత పేరుతో ఆందోళనలు నిర్వహించడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అన్నారు. యూరియా కొరత పేరుతో రైతులను రెచ్చగొట్టవద్దని హితవు పలికారు 

యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దు, నానో యూరియా పై దృష్టి పెట్టాలి: మండల వ్యవసాయ అధికారి రేపాల శరత్ చంద్ర 

యూరియా కొరత పేరుతో రైతులు ఆందోళన చెందవద్దు. రైతులకు సరిపడా యూరియా అందించేందుకు వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. నానో యూరియా పై రైతులు దృష్టి పెట్టాలి. 2024తో పోల్చుకుంటే 2025లో మొక్కజొన్న పంట సాగు పెరిగింది. 2024లో మండలంలో మొక్కజొన్న సాగు 500 ఎకరాలు ఉండగా 2025 లో 1300 ఎకరాల విస్తీర్ణం సాగయిందన్నారు. 2024 సెప్టెంబర్ నాటికి మండలానికి 1520 టన్నుల యూరియా దిగుమతి అయ్యిందని,ఈ ఏడాది ఆగస్టు 25 నాటికి 1540 టన్నుల యూరియా దిగుమతి అయ్యిందని తెలిపారు. 2024తో పోల్చుకుంటే పత్తి పంట, వరి సాగు విస్తీర్ణంలో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. రబి సాగు నాటికి యూరియా కొరత ఉంటుందనే ఉద్దేశంతో రైతులు ముందస్తు చర్యలు చేపట్టడం వల్లనే యూరియా కొరత పుకార్లు ఎక్కువయ్యాయని తెలిపారు. అవసరాన్ని బట్టి యూరియాను వాడాలని, కొరత పేరుతో ఇళ్లలో యూరియాను నిలువ చేసుకోరాదని సూచించారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad