– విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందన్న డాక్టర్లు: పరిస్థితిని పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల : శుక్రవారం రాత్రి ధర్మవరం బిసి హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ కారణంగా 53 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి అయ్యారు. విషయం తెలిసిన జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ తెలిపారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నియంత్రణలో ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఆర్డీవో అలివేలు, డాక్టర్ నవీన్ చంద్ర, అశోక్ తదితరులు ఎప్పటికప్పుడు విద్యార్థుల ఆరోగ్య స్థితిని పరిశీలించడం జరుగుతుందని, ఆరోగ్యం పూర్తిగా నయం అవగానే తిరిగి పంపించడం జరుగుతుందని వైద్యాధికారులు తెలియజేశారు.
బిసి హాస్టల్లో ఫుడ్ పాయిజన్..53 మంది విద్యార్థులకు అస్వస్థత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


