– హుస్నాబాద్ మండల ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు పొన్నబోయిన శ్రీనివాస్ ముదిరాజ్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
రైతులకు సరిపడ యూరియా అందించని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎకరాకు రూ.40 వేల నష్టపరిహారం ఇవ్వాలని హుస్నాబాద్ మండల ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు పొన్నబోయిన శ్రీనివాస్ ముదిరాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.
అభివృద్ధి పనులకు 40 సార్లు ఢిల్లీకి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు యూరియా కావాలని అడగలేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కువగా రైతులు వరి, మొక్కజొన్న, పత్తి పంటలు సాగు చేశారని, ఈ పంటలకు యూరియా తప్పనిసరి అవసరం ఉంటుందన్నారు. పంట పెరుగుదలకు, పచ్చదనానికి యూరియా పనిచేస్తది అలాంటిది వరి నాట్లు వేసిన 10, నుండి 15 రోజులలో ఒకసారి కలుపు తీసిన వెంటనే మరొకసారి పొట్ట పిండిగా చివరిగా వాడటం జరుగుతుందన్నారు. అలాంటిది వరి పంట సన్నపొట్టకు వచ్చే దశవరకు కూడా యూరియా వేయకపోతే ఆ పంట పెరగదు దిగుబడి రాక రైతుకు నష్టమే అవుతుందన్నారు.
వయసు దాటినా తర్వాత ఎరువులు వేస్తె లాభం ఉండదన్నారు. ప్రభుత్వం ముందుచూపు లేనితనం అసమర్థత తో ఈ సమస్య తలెత్తిందన్నారు. ఆరుగాలం కష్టపడి రైతు పంట పండిస్తేనే ఈ ప్రపంచం కడుపునిండా అన్నం తినేది అన్నారు .పంటను కాపాడుకునే రైతు మబ్బుల లేచి ఎరువుల దుకాణల ముందు చెప్పులు, పాస్ బుక్ లు లైన్లో పెట్టి తిండి లేక నీరు లేక ఉపవాసంతో ఉంటే ఈ నాయకులకు ఈ ప్రభుత్వానికి రైతుల గోస తగలదా అన్నారు. కేంద్రం ఇస్తదా రాష్ట్రం ఇస్తదా అనేది కాదనీ రాష్ట్ర ప్రజలకు ఏది అవసరమో రాష్ట్ర ప్రభుత్వమే సమాకూర్చాలే అని అన్నారు. ప్రతి ఒక్క రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.