- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేంద్రంలో శుక్రవారం మండల వ్యవసాయ అధికారి తనుజ రాజ్ తనిఖీలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ పిఎసిఎస్ ఎరువుల కేంద్రంలో డిపిఏ 82.05, కాంప్లెక్స్ ఎరువులు 415.35, యూరియా 58 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులకు అవసరమైన ఎరువులను నిబంధనల ప్రకారం పంపిణీ చేయాలన్నారు. రైతుల తమ పంటలకు అవసరమైన ఎరువులను సమయానికి తీసుకోవాలని సూచించారు.
- Advertisement -