నవతెలంగాణ – గండీడ్
మండల కేంద్రంలోని షాపులలో వారం రోజుల నుండి తిరిగిన యూరియా దొరకకపోవడంతో మరో రెండు రోజులైనా యూరియా రాకపోవచ్చని సమాచారం తెలుసుకున్న రైతులు శనివారంజాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. అధికారులు వెంటనే స్పందించి యూరియాను అందజేయాలని రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో యూరియా పంపిణీ చేయాలని, మండల వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో టోకెన్లు జారీ చేసి రైతులందరికీ యూరియా అందేవిధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. రైతులు రోడ్డుపై బైఠాయించడంతో రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. తమకు సరిపడా యూరియా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొనిఎస్ఐ శేఖర్ రెడ్డి అధికారులతో, షాపు యజమానులతో మాట్లాడి ప్రతి రైతుకు రెండు సంచులు అందే విధంగా ఏర్పాట్లు చేస్తామని రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
యూరియా కోసం జాతీయ రహదారిపై రైతుల ఆందోళన..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES