వడగండ్ల వానకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
ఈనెల 16 న జిల్లా వ్యాప్త ధర్నాలు
తుమ్మల వెంకటరెడ్డి తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి
నవతెలంగాణ – గోవిందరావుపేట
జిల్లా రైతాంగానికి సకాలంలో ప్రభుత్వం యూరియా అందించాలని గతంలో వడగళ్ల వాళ్లకు నష్టపోయిన రైతాంగానికి పరిహారం వెంటనే చెల్లించాలని ఈ 16 న తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా నిర్వహించే ధర్నాలలో రైతులు అధికంగా పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి తుంబల వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మండలంలో తెలంగాణ రైతు సంఘం ములుగు జిల్లా కమిటీ సమావేశం తీగల ఆదిరెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి హాజరైన తుమ్మల వెంకటరెడ్డి తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ జిల్లాలో యూరియా లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని పంట పొలాలు వదిలిపెట్టి ప్రతిరోజు మండల కేంద్రంలో చుట్టూ యూరియా కోసం తిరుగుతున్నారని రాష్ట్రంలో సెప్టెంబర్ కోట 23 వేల మెట్రిక్ టన్నులు వస్తున్నదని యూరియా కొరత ఉండదని మంత్రులు ఒకపక్క ప్రకటిస్తున్న రైతులకు మాత్రం యూరియా అంధక చాలా ఇబ్బందులు పడుతుందని పేర్కొన్నారు.
ఇప్పటికే అనేక పంట పొలాలు యూరియా లేక దిగుబడులు తగ్గుతాయని పేర్కొన్నారు. ఈ సెప్టెంబర్ లో జిల్లా వ్యాప్తంగా వరికి ఎక్కువ యూరియా అవసర ఉన్నదని అధికారులు వరి పండించే ప్రాంతాలని దృష్టిలో పెట్టుకొని ఆయా మండలాలకు ఎక్కువ యూరియా కేటాయించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా గత యాసింగిలో వడగండ్ల వాన పడి పండిన పంట 80 శాతం దెబ్బతిని రైతులు పూర్తిగా నష్టపోయారని వారికి ములుగు జిల్లాలో ఐదు కోట్ల 72 లక్షలు విడుదలైనట్టు పేర్కొని నెలలైనా రైతుల ఖాతాలో జమ చేయలేదని వాటిని కూడా ప్రభుత్వం వెంటనే జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
యాసింగిలో పండించిన సన్నధాన్యానికి బోనస్ ఇంతవరకు ఇవ్వలేదని వెంటనే అందించాలని డిమాండ్ చేశారు .పై సమస్యల సాధనకై ములుగు జిల్లా వ్యాప్తంగా మండల కార్యాలయం ముందు సెప్టెంబర్ 16 జరుగు ధర్నాలలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని చేయాలని కోరారు .ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు వాడకాపురం సారయ్య ,ఎండి యాకూబ్, గుండు రామస్వామి, కాపకోటేశ్వరరావు, కొట్టెం కృష్ణారావు .ఖ్యాతం సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు*
రైతులకు సకాలంలో యూరియా అందించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES