పిఎసిఎస్ ఛైర్మన్ లింగాల రాజలింగా రెడ్డి
నవతెలంగాణ – మిరుదొడ్డి
అరుకాలం కష్టపడి పండించిన మొక్కజొన్న పంటని దలారులకు విక్రయించి మోసపోవద్దని పిఎసిఎస్ ఛైర్మన్ లింగాల రాజలింగారెడ్డి అన్నారు. మండల కేంద్రం మిరుదొడ్డి వద్ద పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలలో విక్రయించి మద్దతు ధర క్వింట కి 2400/ రూ పొందలని సూచించారు.
రైతులు తెచ్చిన పంటను వెనువెంటేనే కొనుగోలు చేయాలని సిబ్బంది కి సూచించారు. మిరుదొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మండలంలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సిద్ధం చేసుకోవాలన్నారు.మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం తెలిపారు మండలంలోని రైతులు ఈ యొక్క అవకాశాన్ని సగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమములో ఏపీఎం లక్ష్మి నర్సమ్మ , గ్రామస్థులు తోట అంజి రెడ్డి ,నంట బాపు రెడ్డి ,కాసా కిష్టయ్య , సల్లూరు మల్లేశం,మొగుళ్ల మల్లేశం ,వల్లల సత్యనారాయణ ,గొట్టం బైరయ్య, బాలరాజు, దరా స్వామీ, పిఎసిఎస్ డైరెక్టర్ రవి,నాగులు, సీఈవో రాజు , ఏఈఓ ను ప్రశాంత్, రేణుక తది తరులు పాల్గొన్నారు.
దలారులను నమ్మి రైతులు మోసపోవద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



