నవతెలంగాణ – కాటారం
కాటారం పశువైద్యశాల పరిధిలోని బయ్యారం,మద్దులపల్లి గ్రామంలో బుధవారం పశువులకు ముద్ద చర్మవ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా పశువైద్యశాఖ అధికారులు మాట్లాడుతూ..వ్యాధి ప్రబలకుండా రైతులు తప్పనిసరిగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రత పాటించడం, పశుగ్రాసాన్ని పొడిగా నిల్వ చేయడం, పశువులను క్రమం తప్పకుండా శుభ్రపరచడం, అనారోగ్య లక్షణాలు గమనించిన వెంటనే వెటర్నరీ సిబ్బందిని సంప్రదించాలంటూ రైతులకు సూచనలు అందించారు. గ్రామంలోని పలువురు రైతులు ఈ టీకా కార్యక్రమంలో పాల్గొని తమ పశువులకు టీకాలు వేయించుకున్నారు. పశువుల ఆరోగ్య పరిరక్షణలో నిర్లక్ష్యం వహించవద్దని అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ రమేష్ సిబ్బందితో కలిసి పాల్గొన్నారు.
రైతులు పశువులకు వచ్చే వ్యాధుల పట్ల నిర్లక్ష్యం చేయవద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES