నవతెలంగాణ-యాదగిరిగుట్ట రూరల్
పంట నష్ట పోయిన రైతుల పొలాలను అధికారులు వెంటనే పర్యవేక్షించి నష్ట పరిహారం చెల్లించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం, యాదగిరి గుట్ట మండలం మల్లాపురం, రైతులను కలిసి అకాల వర్షానికి నీట మునిగిన వరి పంటలను ఉట్కూరి అశోక్ గౌడ్ సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలని అన్నారు. తడిసిన ధాన్యని వెంటనే కొనుగోలు చేయాలి. ధాన్యానికి క్వింటాలు కు 2400 కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర చెల్లిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలు కు 500 రూపాయలు బోనస్ ఇస్తాను అని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వకుండా రైతులను మోసం చేస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కాదురీ అచ్చయ్య, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుంటిపల్లి సత్యనారాయణ, జిల్లా కౌన్సిల్ మెంబర్ గందమల్ల మహేశ్ గౌడ్, ఆకుల చంద్రమౌళి, కళ్ళెం శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి గోపగని ప్రసాద్, శరజి లక్ష్మయ్య, గుండా నర్సింహులు, దొమ్మట రాజు, కర్రె శ్రీకాంత్, భగవత్ రెడ్డి, మంగ మహేందర్, కర్రె మహేందర్, బాల్ చారి, చంద్రశేఖర్ రెడ్డి, సాయి తదితరులు పాల్గొన్నారు.
రైతులు నష్టపోయిన పంటకు నష్ట పరిహారం చెల్లించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



