Tuesday, October 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉచిత పశు వైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి 

ఉచిత పశు వైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి 

- Advertisement -

మండల పశు వైద్యాధికారి అశోక్ రెడ్డి 
నవతెలంగాణ – పాలకుర్తి

గాలికుంటు వ్యాధి నివారణకు మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే ఉచిత పశువైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల పశు వైద్యాధికారి దేవిరెడ్డి అశోక్ రెడ్డి సూచించారు. మంగళవారం మండలంలోని బమ్మెరలో గాలికుంటు  వ్యాధి నివారణకు ఉచితంగా పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పశు వైద్యాధికారి అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. పశువులకు గాలికుంటు వ్యాధి వస్తుందని తెలిపారు. పశువులతో పాటు పాడి గేదెలకు వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉంటూ అందుబాటులో ఉన్న పశు వైద్య సిబ్బందికి సమాచారం అందించాలని రైతులకు సూచించారు. గాలికుంటు  వ్యాధి నివారణ కోసం నిర్వహించిన ఉచిత పశువైద్య శిబిరంలో 420 పశువులకు, పాడి గేదెలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు, మందులను అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపాలమిత్రలు, పశు మిత్రలు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -