నవతెలంగాణ – తంగళ్ళపల్లి
రాబోయే మూడు రోజుల తుఫాన్ కారణంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మండలంలోని రైతులు ధాన్యం తవడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తహసీల్దార్ జయంత్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి తూకం వేసిన వాటిని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు.కేంద్రంలో ఆరబోసేందుకు ఉన్న ధాన్యాన్ని కుప్పలుగా చేసి టార్పాలిన్ కవర్లతో కప్పి ఉంచి వర్షానికి తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాబోయే మూడు రోజులు వర్షాలు తగ్గే వరకు రైతులు హార్వెస్టర్లతో కోతలు నిలిపి వేయాలని అన్నారు. రైతులు తగు ముందు జాగ్రత్త చర్యలు పాటించి పంట నష్టం కాకుండా అధికారులకు సహకరించాలని కోరారు.
ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



