- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. మంగళవారం ఉదయమే నుంచే తాడిచెర్ల పిఏసిఎస్ కేంద్రం వద్ద, కొయ్యుర్ ఓ ప్రయివేటు వ్యాపారి దుకాణం ముందు రైతులు నిరీక్షణ చేశారు. పిఏసిఎస్ కు 20 టన్నులు, వ్యాపారి వద్దకు 180 బస్తాలు (5టన్నుల)యూరియా బస్తాలు రాగా ఈపాస్ యంత్రంలో వివరాలు నమోదు చేసిన అనంతరం రైతుల మొబైలక్కు ఓటీపీ వచ్చాక పంపిణీ చేశారు.ఈ విధానంతో పంపిణీ ఆలస్యం అవుతోందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే 20 లారీలు,400 తన్నుల యూరియా పిఏసిఎస్ కేంద్రం ద్వారా రైతులకు పంపిణీ చేసినట్లుగా పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య తెలిపారు. రైతులకు ఇబ్బందులకు గురికాకుండా సరిపడా యూరియా తెప్పించి అందజేస్తామని తెలిపారు.
- Advertisement -