Saturday, March 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

- Advertisement -

– ఆర్గానిక్‌ ఫార్మింగ్‌లో ఎస్‌హెచ్‌జీలను భాగస్వామ్యం చేయండి
– వ్యవసాయ సంస్థలపై సోలార్‌ రూఫ్‌ టాప్‌లు ఏర్పాటు చేయండి : వ్యవసాయ శాఖ ప్రీ బడ్జెట్‌ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నొక్కి చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్‌ రెడ్డిలతో నిర్వహించిన ప్రీ బడ్జెట్‌ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రతిపాదనల పై చర్చించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ ఆర్గానిక్‌, నేచురల్‌ ఫార్మింగ్‌లో స్వయం సహాయక సంఘాలను భాగస్వామ్యం చేయాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా కూరగాయలు, పూల సాగు చేయించి ఆ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. రైతు వేదికలు, వ్యవసాయ మార్కెట్‌ గోడౌన్లు, వేర్‌ హౌసింగ్‌ గోదాములపై సోలార్‌ రూఫ్‌ టాప్‌లు ఏర్పాటు చేసు కొని విద్యుత్‌ ఉత్పత్తి చేసుకోవాలని సూచించారు. ఈ వ్యవస్థ ద్వారా వ్యవసాయ శాఖకు విద్యుత్‌ ఖర్చులు మిగలడంతో పాటు అదనంగా ఉత్పత్తి చేసిన విద్యుత్తును విక్రయించుకునే అవకాశం కలు గుతుందనీ, ఆర్థికంగా బలపడే అవకాశం ఉంటుం దని తెలిపారు. వ్యవసాయ శాఖ సంస్థలపై సోలార్‌ రూఫ్‌టాప్‌ల ఏర్పాటుకు సంబంధించి రెడ్కో సంస్థ ను సంప్రదించి అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ..రైతు సంక్షేమ మే ధ్యేయంగా సబ్సిడీపై యంత్ర పరికరాలు పెద్ద సంఖ్యలో పంపిణీ చేస్తున్నామనీ, విత్తనాలను సబ్సిడీపై అందజేస్తున్నామని వివరించారు. రాష్ట్రం లో ఎత్తిపోతల పథకాల కింద వివిధ రకాల పంటలు సాగు చేస్తున్న తీరు, నీటి సరఫరా, యాసంగి వరి సాగు, మార్కెట్లోకి రానున్న ధాన్యం, సేకరణ తదితర అంశాలపై మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు చర్చించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, వ్యవసాయ శాఖ కమిషనర్‌ గోపి, అగ్రికల్చర్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ అల్దాస్‌ జానయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -