విద్యుత్ సవరణ బిల్లు 2025, రైతు వ్యతిరేక విధానాలు ఆపాలని కోరుతూ…
19 చోట్ల నిరసనలు, రైళ్ల సేవలకు అంతరాయం
చండీగఢ్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లు 2025, ఇతర రైతు వ్యతిరేక విధానాలు ఆపాలని కోరుతూ పంజాబ్‌లోని రైతులు పట్టాలెక్కి శాంతియుత నిరసన చేపట్టారు. పంజాబ్ రైతు సంస్థ, కిసాన్ మజ్దూర్ మోర్చా ఇచ్చిన పిలుపుమేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ”రైల్ రోకో” నిరసనలు నిర్వహించారు.. 19 చోట్ల పట్టాలపై రైతులు బైటాయించారు. అయితే శాంతియుత నిరసనకు ముందు రాష్ట్ర ప్రభుత్వం తమ కొంతమంది నాయకుల ఇండ్లపై పోలీసులు దాడి చేసి, గృహ నిర్బంధంలో ఉంచిందని రైతు నేతలు తెలిపారు. అమృత్‌సర్ , గురుదాస్‌పూర్‌లలో, రైతు నాయకులు పరమ్‌జిత్ సింగ్ భుల్లార్, జగ్‌దీప్ సింగ్ జగ్గి, కుల్దీప్ సింగ్ తహ్లి, బీబీ హర్జిత్ కౌర్ గురుదాస్‌పూర్, నిషాన్ సింగ్ మెహడే, హర్పాల్ సింగ్ పఠాన్‌కోట్‌ల ఇండ్లపై పోలీసులు దాడి చేశారు. రైతుల ఆందోళనల కారణంగా.. షాన్-ఎ-పంజాబ్, ఢిల్లీ-అమృత్‌సర్ శతాబ్ది, టాటా ఎక్స్‌ప్రెస్, ఫ్లయింగ్ మెయిల్ , అమృత్‌సర్ .. ఢిల్లీ మధ్య నడిచే రైళ్లకు అంతరాయం కలిగింది. రైలు దిగ్బంధనం సమయంలో 80 శాతం ట్రాక్‌లపై రైళ్లు నడపడం లేదని మోర్చా నాయకులు తెలిపారు.
రైతు సంఘాల డిమాండ్లు..
2025 విద్యుత్ సవరణ బిల్లును పూర్తిగా ఉపసంహరించుకోవాలి. ప్రీపెయిడ్/స్మార్ట్ మీటర్లను తొలగించి, పాత మీటరింగ్ వ్యవస్థను పునరుద్ధరించాలి. ప్రతిపాదిత చట్టం , రాష్ట్ర ప్రభుత్వ విధానాలు విద్యుత్ బోర్డుల ప్రయివేటీకరణకు వ్యతిరేకించాలి. రైతులు, కార్మికులు, సాధారణ వినియోగదారులపై అదనపు భారాలను మోపని చర్యలు తీసుకోవాలి.
పంజాబ్‌లో పట్టాలెక్కిన రైతులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



