- Advertisement -
అధికారులు స్పందించక, సొంత నిధులతో మరమ్మత్తు
నవతెలంగాణ – రామారెడ్డి
భారీ వర్షాలు కురిట్టడంతో మండల కేంద్ర పరిసర ప్రాంతంలోని రంగ చెరువు అలుగు గోడ కూలి నీరు వృధా పోతుండడంతో, అధికారులు స్పందించకపోవడంతో బుధవారం రైతులు ఏకమై స్వంత డబ్బులతో మరమ్మత్తు నిర్వహించారు. రైతులు మాట్లాడుతూ…. ప్రభుత్వాలు వెంటనే స్పందించి వ్యవసాయానికి ఉపయోగపడే ఇలాంటి పనులను నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ బీసీ సెల్ మండల అధ్యక్షులు జెసిబి శేఖర్, గాండ్ల నర్సింలు, జనార్ధన్, రెడ్డి భూషణ్ , కురుమ సాయిలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -