- Advertisement -
నవతెలంగాణ -హైదరాబాద్ : ఇకపై తిరుమలకు వచ్చే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ నూతన విధానం ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానుంది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వివిధ వాహనాల్లో చేరుకునే భక్తులకు మెరుగైన భద్రతా ప్రమాణాలు, అధిక రద్దీ నివారణ, పారదర్శక సేవలు అందించేందుకు ఈ విధానం అమలు చేస్తున్నట్లు పేర్కొంది.
- Advertisement -