Sunday, July 6, 2025
E-PAPER
Homeసినిమాఫారెన్‌లో శరవేగంగా..

ఫారెన్‌లో శరవేగంగా..

- Advertisement -

వరుణ్‌ తేజ్‌, దర్శకుడు మేర్లపాక గాంధీ కాంబినేషన్‌ ఇండో-కొరియన్‌ హర్రర్‌-కామెడీతో సర్‌ ప్రైజ్‌ చేయబోతున్నారు. యూవీ క్రియేషన్స్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ టర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. హైదరాబాద్‌, అనంతపురం షెడ్యూల్స్‌ తర్వాత ఇప్పుడు ఫారిన్‌లో టింగ్‌ రవేగంగా జరుగుతోంది. వరుణ్‌ తేజ్‌తోపాటు ప్రధాన తారాగణం పాల్గొంటున్న ఈ షెడ్యూల్‌లో మోస్ట్‌ ఎంటర్టైనింగ్‌ అండ్‌ హై ఎనర్జీ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నారు.ఈ షెడ్యూల్‌తో 80% చిత్రీ కరణ పూర్తవుతుంది. దర్శకుడు మేర్లపాక గాంధీ, యువీ క్రియేషన్స్‌తో కలిసి వరుణ్‌ తేజ్‌ చేస్తున్న మొదటి సినిమా ఇది. ‘కంచె’ తర్వాత ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్టైన్‌మెంట్‌తో వరుణ్‌ తేజ్‌ నటిస్తున్న రెండో సినిమా కావడం విశేషం. టైటిల్‌, గ్లింప్స్‌తో సహా మరిన్ని అప్‌డేట్స్‌ను మేకర్స్‌ త్వరలోనే తెలియజేస్తారు. ఈ సినిమా మునుపెన్నడూ లేని విధంగా బిగ్‌ స్క్రీన్‌ పై హాంట్‌ చేసే హిలేరియస్‌ రైడ్‌ని అందిస్తుంది అని మేకర్స్‌ దీమా వ్యక్తం చేశారు. వరుణ్‌ తేజ్‌, రితికా నాయక్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్య ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -