Wednesday, July 9, 2025
E-PAPER
Homeజాతీయంఘోర ప్రమాదం.. బ్రిడ్జి కూలి నదిలో పడిపోయిన వాహనాలు..ముగ్గురు మృతి

ఘోర ప్రమాదం.. బ్రిడ్జి కూలి నదిలో పడిపోయిన వాహనాలు..ముగ్గురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: గుజరాత్ లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. మహిసాగర్ నదిపై ఉన్న గంభీరా బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోవడంతో ప్రమాదం జరిగింది. బుధవారం బ్రిడ్జి ఒక్కసారిగా కూలి నదిలోకి పడిపోయింది. దీంతో బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న నాలుగు వాహనాలు నదిలో పడిపోయాయి. పద్రా తాలూకా ముజ్ పూర్ గ్రామ సమీపంలో మహిసాగర్ నదిపై ఉన్న బ్రిడ్జిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  రెండు ట్రక్కులు, ఒక బొలెరో SUV, ఒక పికప్ వ్యాన్ కలిపి.. నాలుగు వాహనాలు నదిలో పడిపోవడంతో ముగ్గురు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. అదే విధంగా 5 మందిని రెస్క్యూ టీమ్స్ కాపాడాయి. మరికొంత మంది గల్లంతయ్యారు. వారికోసం గాలింపు చర్యలు చేపట్టాయి NDRF రక్షణ బలగాలు .  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -