- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: స్వీట్జర్లాండ్‌లో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. రాజధాని బెర్న్ సమీపంలోని కెర్జర్స్ పట్టణంలో పోస్ట్‌బస్ సంస్థకు చెందిన ప్రాంతీయ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. సహాయక బృందాలు చేరుకునేలోపే బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
- Advertisement -



