నవతెలంగాణ-హైదరాబాద్ : అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని హాపూర్ లో చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ బైక్ అదుపు తప్పి బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడిక్కడే ప్రమాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో నలుగురు మైనర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బుధవారం రాత్రి హపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని బులంద్‌షహర్ రోడ్డులోని మినీలాండ్ స్కూల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని, రఫీక్‌నగర్ నివాసి డానిష్ (40) హాపూర్ ప్రాంతంలోని తన స్నేహితుడి ఫామ్‌హౌస్‌లోని స్విమ్మింగ్ పూల్ నుండి సోదరుడి పిల్లలతో కలిసి మోటార్‌సైకిల్‌పై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES