Thursday, August 7, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మైనర్ బాలురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మైనర్ బాలురు మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగి నలుగురు మృతి చెందారు. ఈ విషాద సంఘటన గురువారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని గడ్చిరోలిలో చోటు చేసుకుంది. అర్మోరి-గడ్చిరోలి హైవేపై ఉదయం 5 గంటల ప్రాంతంలో వేగంగా వెళ్తున్న ట్రక్కు రోడ్డు వెంట ఉన్న వారిపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు బాలురు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు ట్రక్కు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే వర్షం కారణంగా ట్రక్కు అదుపుతప్పడం, రోడ్డు సరిగ్గా కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ట్రక్కు డ్రైవర్ చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img