-చర్మవ్యాధులతో వీధుల్లో సంచారం
-బెంబేలెత్తుతున్న ప్రజలు
నవతెలంగాణ-మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లతోపాటు ఆయా గ్రామాల్లో విధి కుక్కలకు వింత రోగాలతో సంచరిస్తున్నాయి. చర్మ సంబంధిత వ్యాధుల బారిన పడిన శునకాలు వీధుల్లో సంచరిస్తుండంతో జనం బెంబేలెత్తుతున్నారు. కుక్కల ఒంటిపై బొచ్చు ఊడిపోవడం,దద్దుర్లు రావడం,చిన్నపాటి కురుపులు, పుండ్లు ఏర్పడుతున్నాయి.లంపీస్కిన్ వైరస్ సోకినట్లు ప్రచారంలో ఉంది. మండలంలోని 15 గ్రామపంచాయతీల పరిధిలో ఆయా గ్రామాల్లో సుమారు వెయ్యి కుక్కలు ఉన్నాయి. కుక్కలకు ప్యారాసైట్ ఇన్ఫిస్టేషన్ సోకుతోందని,తద్వారా వాటి శరీరంపై బొచ్చు ఊడి పోయి గజ్జిలా ఏర్పడుతోందని, మరికొన్ని కుక్కలు లివర్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్టు మండల పశువైద్యాధికారి అబిలాస్ చెబుతున్నారు.
నివారణ చర్యలు శూన్యం..
గ్రామాల్లో వీధి కుక్కల బెడద ప్రజలను వేధిస్తోంది. వింత వ్యాధుల బారిన పడిన కుక్కలకు చికిత్స అందకపోవడంతో కొన్ని చనిపోతుండగా, మరికొన్ని ఆరోగ్యం క్షీణించిన పరిస్థితిలో వీధుల్లో, ఇళ్ల పరిసరాల్లో సంచరిస్తున్నాయి. కుక్కల నుంచి పశువులకు రోగం సోకుతుందేమోనని పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు.అధికారులు స్పందించి కుక్కల నివారణ చర్యలు చేపట్టడంతో పాటు వింత రోగాల బారిన పడిన వాటికి చికిత్స అందించాలని ప్రజలు కోరుతున్నారు.
వీధి కుక్కలకు వింత రోగం.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



