Thursday, August 14, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంచెట్టు కూలి తండ్రి కూతురు మృతి

చెట్టు కూలి తండ్రి కూతురు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఢిల్లీలో చెట్టుకూలి తండ్రి కూతురు చ‌నిపోయారు. దేశ‌రాజ‌ధానిలో ప‌లు రోజులుగా ఎడాతెరిపి లేకుండా భారీ వ‌ర్షాలు కురుస్తున్న విష‌యం తెలిసిందే. ఇవాళ కల్కాజి ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న ఓ వందేళ్ల నాటి వృక్షం రోడ్డుపై కుప్పకూలింది. అదే సమయంలో అటుగా బైక్ మీద వెళ్తున్న తండ్రీకుమార్తె సుధీర్ కుమార్, ప్రియ మీద పడింది. దీంతో బైక్, చెట్టు మధ్యలో ఇరుక్కుపోయిన వారు గంటసేపు నరకం అనుభవిస్తూ ఆర్తనాదాలు చేసారు. సమాచారం అందుకున్న పోలీసులు, NDRF టీమ్ వారి మీద పడిన చెట్టును తొలగించేందుకు నానా తంటాలు పడ్డారు. చివరికి స్థానికుల సహాయంతో చెట్టును తొలగించి వారిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తండ్రి మరణించగా.. కూతురు పరిస్థితి కూడా విషమంగా ఉంది. అయితే ఈ ప్రమాదంలో వీరితోపాటు మరికొందరు గాయపడినట్టు సమాచారం.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad